18 July, 2026 | 10:01 PM

బుదేరా మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

18-07-2026 09:19 PM

మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని బుదేరా చౌరస్తాలో గల గురుకుల  మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్  ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అకడమిక్ భవనం, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌ తదితర వాటిని పరిశీలించారు. అంతకుముందు అధ్యాపకుల హాజరు పట్టికను పరిశీలించారు. తరగతిగదులు, కంప్యూటర్ , ఏఐ క్లాసెస్ జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్  వెంట తహసీల్దార్ రంగారావు, కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి,  అధ్యాపకులు తదితరులు ఉన్నారు.