27 June, 2026 | 10:20 PM

ఇబ్రహీంపట్నం డిపో నుంచి దైవదర్శనానికి బస్సు సౌకర్యం

15-06-2025 12:30 AM

ఈనెల 27 నుంచి ప్రారంభం..

భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. 

ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకట నర్సప్ప...

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డిపో నుంచి దైవదర్శనానికి ఇకనుంచి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వెంకట నర్సప్ప(Depot Manager Venkata Narsappa) తెలిపారు. ప్రసిద్ధ దేవాలయాలు అయినటువంటి కీసరగుట్ట, యాదగిరిగుట్ట ,స్వర్ణగిరి ,చెరువుగట్టు దేవాలయాలను ఒకేరోజు దర్శించుకునే గొప్ప అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు.  ఈ నెల 27వ తేదీ నుండి మెట్రో డీలక్స్ లో కేవలం రూ.750కే స్పెషల్ దైవదర్శనం టూర్ ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

సమయం. ఉదయం 6:00 కు ఇబ్రహీంపట్నం నుండి బయలుదేరి ఉ 7.15 కీసరగుట్ట దర్శనం, తర్వాత బ్రేక్ ఫాస్ట్, ఉ 11.30 లకు యాదగిరిగుట్ట దర్శనం, తర్వాత లంచ్, మధ్యాహ్నం 3.00 స్వర్ణ గిరి దర్శనం, తర్వాత టీ బ్రేక్, సాయంత్రం 6.00  తర్వాత బయలుదేరి తిరిగి రాత్రి 10 గంటల వరకు ఇబ్రహీంపట్నం చేరుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా 30 మంది భక్తులు ఉన్నచో వారి దగ్గరికి బస్సు రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్ మేనేజర్, రాజేష్ ఫోన్.79817 45576 నెంబర్ కు సంప్రదించాలని అన్నారు.