16 April, 2026 | 6:00 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అత్తింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

15-06-2025 12:33 AM

ఖానాపూర్ (విజయక్రాంతి): అత్తగారి ఇంట్లో వేధింపులు తట్టుకోలేక వివాహిత శైలజ(20) ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం... మూడు నెలల క్రితం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన దండుగుల నరసవ్వ, పోచన్న దంపతుల కూతురు శైలజను అదే గ్రామానికి చెందిన అల్లెపు రాజేష్ కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి అయినా రెండు నెలల నుంచి శైలజను తన భర్త రాజేష్, అత్త లక్ష్మి రోజు వరకట్నం తేవాలని, లేకుంటే వెళ్లిపోవాలని వేధించడం మొదలు పెట్టారని తల్లిదండ్రులకు మృతురాలు వివరించిందని బంధువులు తెలిపారు. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.