24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

రాజీవ్ రహదారిపై బస్సు, లారీ ఢీ

09-03-2026 01:03 PM

8 మందికి తీవ్ర గాయాలు 

గజ్వేల్:  సిద్దిపేట జిల్లా  వర్గల్ మండలం గౌరారం రాజీవ రహదారి పై  బస్సు,లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ నుండి సిద్దిపేటకు వస్తున్న సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు  ముందుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.