ఎట్టకేలకు తెల్లవారుజామున ఖానాపూర్ నుంచి హైదరాబాదుకు బస్సు సర్వీస్
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రం నుంచి కొన్ని సంవత్సరాలుగా తెల్లవారు జామున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు నిర్మల్ డిపో నుంచి బస్సు సర్వీసు ఉండగా, దానిని ఇటీవల రద్దు చేయడంతో ఖానాపూర్, కడం, పెంబి, దస్తురాబాద్, మండలాల ప్రజలు హైదరాబాద్ పట్టణానికి రాకపోకులకు తీవ్ర ఆర్థిక భారం, సమయాభారం, కలిగి నష్టపోతున్న నేపథ్యంలో ప్రజలు ఈ బస్సు సర్వీసు పునరుద్ధరించాలని డిమాండ్ చేయగా, జగిత్యాల జిల్లా మెట్టుపల్లి డిపో నుంచి ఉదయం 5:15 గంటలకు మంగళవారం నుంచి ఈ సర్వీస్ ను పునరుద్ధరించారు.
వయా మెట్పల్లి నుంచి హైదరాబాద్కు చేరుకునే విధంగా బుదవారం నుంచి ఈ సర్వీస్ ను ప్రారంభించనున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు.కాగా ఈ సర్వీసు ఎక్స్ప్రెస్ సర్వీస్ వేసి మహాలక్ష్మి పథకం మహిళ లకు , ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాజధానికి ఉదయం బస్సు సర్వీసు నిర్మల్ డిపో కాకుండా మెట్పల్లి డిపో నుంచి వేయడం ప్రజలు హర్షిస్తున్నారు.






