20-05-2025 02:24:09 PM
- ఇల్లెందులో కార్మిక సంఘాల నిరసన
ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల పిలుపుమేరకు మంగళవారం ఇల్లెందులో కొత్తబస్టాండ్(Yellandu New bus stand) సెంటర్లో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, సిఐటియు జిల్లా సహాయకార్యదర్శి ఎస్ఏ.నబి, టియుసిఐ ఇల్లెందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను, ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, స్కీం వర్కర్లందర్నీ పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం నెలకు 26వేల రూపాయలు ఇవ్వాలని, అసంఘటితరంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల జులై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఐఎఫ్టియు ఇల్లెందు ఏరియా కార్యదర్శి నరాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి.రాసుద్దీన్, రాష్ట్ర నాయకులు తోడేటి నాగేశ్వరరావు జిల్లా నాయకులు కొప్పుల శ్రీనివాస్, తొగర సామెల్, రామిశెట్టి నరసింహారావు, టియుఎం చారి, సిఐటియు జిల్లా నాయకులు తాళ్లూరి కృష్ణ, టియుసిఐ జిల్లా నాయకులు కే.వీరన్న, వి.గురునాథం, బి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.