calender_icon.png 20 May, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ఎంపీ పైనే కేసులా...!

20-05-2025 03:31:55 PM

నకిలీ వైద్యులపై చర్యలు లేవా..!!  

వివాదాస్పదంగా మెడికల్ కౌన్సిల్  చర్యలు

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ వైద్య మండలి  జిల్లాలో 14 మంది డాక్టర్లపైన ఆర్ఎంపి  డాక్టర్లపై ఈనెల 18న   కేసులు నమోదు చేసిన విషయం  తెలిసిందే.. గతంలో కాంపౌండర్ గా పనిచేసే  నేషనల్ మెడికల్ కమిషన్, టీఎస్ ఎం పి ఆర్, చెట్ట నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల వేషధారణలో ప్రజలను మోసం చేస్తున్నారని రిజిస్టార్ డాక్టర్ డి లాలయ్య కుమార్, చైర్మన్ డాక్టర్ కె. మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆయా ఆర్ఎంపి డాక్టర్లపై వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు.

ఈ విషయం పై జిల్లాలో  మెడికల్ కౌన్సిల్, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ పట్టాలు పొంది  రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్న   డాక్టర్ లు అపర్ణ రెడ్డి, మాలే సంతోష్ రెడ్డి,శశిధర్ రెడ్డి లతో పాటు మరికొన్ని బడా ఆసుపత్రులవైద్యులపై  చర్యలు తీసుకోవాలని ఆర్ఎంపీలు  మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు  వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అక్రమార్కుల వద్ద నెలా ముడుపులు తీసుకుంటున్నారని  అధికారులపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

కొన్ని బడా ఆసుపత్రుల కనుసన్నల్లో మెడికల్ కౌన్సిల్ వ్యవస్థ కొనసాగుతుందని దీనికి నిరసనగా  ఆర్ఎంపీల సంఘం ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు వినికిడి. ఆర్ఎంపీ ఆసుపత్రులపై మెడికల్ కౌన్సిల్  దాడుల పై సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ, మెడికల్ కౌన్సిల్ సభ్యుల వ్యవహారంపై మంత్రి సీరియస్ అయినట్లు సమాచారం.