18 May, 2026 | 5:34 PM

లోకేశ్వరం కేంద్రంగా ధర్మాబాద్ కు బస్సు సర్వీస్

18-05-2026 04:38 PM

భైంసా ( విజయక్రాంతి):  నిర్మల్ డిపో ద్వారా లోకేశ్వరం అబ్దుల్లాపూర్ ముధోల్ మండల కేంద్రంగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ కు బస్సు సర్వీసు నడిపిస్తున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. ఉదయం 10:40 నిమిషాలకు నిర్మల్ నుండి బయలుదేరిన పల్లె వెలుగు బస్సు ధర్మాబాద్కు ఒంటిగంటకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుండి తిరిగి ముధోల్ అబ్దుల్లాపూర్ లోకేశ్వరం మీదగా నిర్మల్కు తిరిగి వస్తుందని ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ సదుపాయం కల్పించినట్టు ఆయన వివరించారు.