కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షం
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
- అల్పపీడనద్రోనితో కురుస్తున్న వర్షాలు
- ఊపిరి పీల్చుకుంటున్న విత్తనాలు నాటిన రైతులు
కామారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ద్రోని ప్రభావం వల్ల జిల్లాలో వర్షాలు పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం గత 15 రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు తెల్లవారుజామున నుంచి కురుస్తున్న వర్షం ఎంత ఊరట కల్పించింది. వర్షంతో వేసిన విత్తనాలు మొలకెత్తడం జరుగుతుందని రైతులు అంటున్నారు.
ఈ వర్షం పడుకుంటే నాటిన విత్తనాలు వృధా అయ్యేవని రైతులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో తెల్లవారుజామునంచే వర్షం భారీగా కు రీసింది. మేఘావృతమై వర్షం మరింత పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కోట్లాది వర్షం పడినట్లు అయిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఈ వర్షం ఎంత ఊరట కలిగించింది. తెల్లవారుజాము నవరకు ఉదయం 9 గంటల వరకు ఓ మోస్తారు స్థాయి భారీ వర్షం పడడంతో రైతులు నాటిన విత్తనాలకు డోకా ఉండాలని అంటున్నారు. బోరు బావుల వద్ద వరి నాటు వేసేందుకు రైతులు వరి నారుమళ్ళను సిద్ధం చేస్తున్నారు.






