బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం
జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పు వెల్లడి
జగిత్యాల, మే 15 (విజయక్రాంతి): కన్న కూతురిపై లైంగిక దాడి కి పాల్పడిన కసాయి తండ్రికి జగిత్యాల కోర్టు 25 ఏండ్ల కఠిన కారా గార శిక్షను విధించింది. బాధిత బాలికకు రూ.౩ లక్షల పరిహారం చెల్లించా లని ఆదేశించింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా న్యాయమూర్తి నీలిమ బుధవారం తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఎల్లాల తుకారం వ్యవసాయం చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. గతంలో అతడు మొదటి భార్యని చంపిన కేసులో నిందితుడు.
తర్వాత మరో పెళ్లి చేసుకోగా కూతురు జన్మించింది. 14 అక్టోబర్ 2022 రోజున రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కూతురిపై తుకారాం లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైన చెప్తే కూతురితోపాటు భార్యపై పెట్రోల్ పోసి చంపేస్తానని బెదిరించాడు. భయభ్రాంతులకు గురైన బాధితురాలి తల్లి 18 అక్టోబర్ 2022న తుకారాం మొదటి భార్య కొడుకు మహేశ్‌కు చెప్పడంతో కోరుట్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిందితుడిపై పోక్సో చట్టం కింద అప్పటి ఎస్సై సతీశ్ కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రాజు కేసును విచారించారు. బుధవారం కోర్టు అధికారులు సాక్షులను ప్రవేశపెట్టగా, నిందితుడిపై నేరం రుజువైంది.దీంతో తుకారాంకు 25 ఏండ్ల కఠిన కారగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా, బాధి త బాలికకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.