28 March, 2026 | 4:28 PM

Breaking News

సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •   'తొలి ముద్ద'.. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం   •   కిషన్ రావుపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన   •   కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ   •   ఘనంగా రావి వీరవేన్లయ్య 34 వర్ధంతి   •  

ప్రశ్నించే గొంతును గెలిపించుకుందాం

16-05-2024 02:27 AM

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి, మే 15 (విజయక్రాంతి) : ఖమ్మం, వరంగల్, నల్లగొండ శాసనమండలి పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించుకుందామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కోరారు. బుధవారం యాదగిరిగుట్టలో కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గానికి చెందిన ఆయనను గెలిపించుకోవడం ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మె ల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డానని, ప్రభుత్వ నిరాంకుశ వైఖరిని ఎండగట్టి జైలు జీవితం గడిపానన్నారు. ఈ ప్రాంత వాసిగా తనకు మద్దతుగా ఉండాలని కోరారు.