28 March, 2026 | 12:54 PM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు దిమ్మతిరుగుడు ఖాయం

16-05-2024 02:30 AM

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

కరీంనగర్ గెట్ టు గెదర్‌కు భారీగా తరలిన జనం

వరంగల్, మానుకోట, పెద్దపల్లి, నల్లగొండ ఎంపీ అభ్యర్థుల హాజరు

కరీంనగర్,  మే ౧౫(విజయక్రాంతి): జూన్ ౪న వెలువడే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలకు దిమ్మతిరుగుడు ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత  కేసీఆర్ కు ఈ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నాయని చెప్పా రు. దేశమంతా నరేంద్రమోదీ హవా కొనసాగుతోందని, తెలంగాణ అంతటా బీజేపీకి అత్యధిక ఫలితాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం సాయంత్రం కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌లో బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గెట్‌టు గెదర్‌కు పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థులు గోమాస శ్రీనివాస్, అరూరి రమేశ్, సీతారాం నాయక్, సైదిరెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్‌పాల్ సూర్యనారాయణ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమాదేవి, జెనవాడ సంగప్పతోపాటు భారీగా బీజేపీ నాయకుతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు.

కార్యక్రమానికి హాజరైన ప్రజలను చూసి బండి సంజయ్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని  అరూరి రమేశ్, సీతారాంనాయక్, సైదిరెడ్డి పేర్కొన్నారు.