నల్లపోచమ్మ ఆలయం వద్ద మజ్జిగ పంపిణీ
20-03-2026 12:29 AM
నాగిరెడ్డిపేట్, మార్చి 19 (విజయ క్రాంతి): ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రజలకు దాహార్తిని తీర్చే ఉద్దేశంతో కొండ మీరాతాయి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు ప్రజలు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే చినుర్ గ్రామంలో గ్రామ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కొండ మీరాతాయి ఎవరి సహాయం లేకుండా తన సొంత ఖర్చులతో గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎల్‌ఈడి రూప్ లైట్ పెట్టించడం జరిగింది. దీనితో గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరు పాల్గొన్నారు.




