5 July, 2026 | 12:02 PM

పెద్దపల్లిలో దొడ్డి కొమురయ్య, రోశయ్యలకు ఘన నివాళులు

05-07-2026 11:26 AM

హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ 

పెద్దపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ), పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ చరిత్రలో దొడ్డి కొమురయ్య సాగించిన పోరాటం, త్యాగం చిరస్మరణీయమైనవని కొనియాడారు.

అలాగే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ప్రజాహిత పాలన అందించిన రోశయ్య సేవలను, వారి రాజకీయ విలువలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొని నివాళులు అర్పించారు.