13 July, 2026 | 5:33 PM

Breaking News

కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •  

నేడు క్యాబినెట్ భేటీ

23-06-2025 01:07 AM

- పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం

- ‘బనకచర్ల’ కార్యాచరణపై ప్రధానంగా చర్చ

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రే వంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంత్రి వర్గం భేటీ కానున్నది. సీఎం ఈ భేటీలో  పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలిసింది.

ఇదే అంశంపై సర్కార్ ఇటీవల అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు అం దజేశారు.

మంత్రివర్గ భేటీలో బనకచర్లపై మున్ముందు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే నిర్ణయానికి వస్తారని తెలిసింది. అలాగే రైతుభరోసా అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఫోన్‌ట్యాపింగ్ కేసు పూర్వాపరాలపైనా సీఎం చర్చించనున్నట్లు సమాచారం.