15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నాన్‌టాక్స్ రెవెన్యూపై దృషి సారించండి

23-06-2025 01:05 AM

- ప్రాధాన్య క్రమంలో నిధులు ఖర్చు చేయండి

- డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశం

- సచివాలయంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కేపిటల్ సబ్ కమిటీ సమావేశం

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): నాన్‌టాక్స్ రెవెన్యూ రాబడులపై మరింత దృష్టి సారించాలని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కేపిటెల్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆదివారం నిర్వహిం చిన అసెట్స్ సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఆయన మాట్లాడారు.

నాన్ టాక్స్ రెవెన్యూతో పాటు కేంద్ర నుంచి కూడా నిధులు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూడా ఆపకుకూడదని, అలాగే కొత్త గా రూ.33,600 కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2023  ఆర్థిక సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్, ఎక్సుజ్ ఆదాయం రాకుండా పోయిందన్నారు.

రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు సహా పలు కొత్త పథకాలను ప్రజలకు అందజేస్తున్నట్లు వివరించారు. బడ్జెట్ నిధులు కొన్ని శాఖలు అధికంగా, మరికొన్ని శాఖలకు అతి తక్కువగా అందుతున్నాయని అభిప్రాయపడ్డారు. బడ్జెట్  నిధులను అన్ని శాఖలు, డిపార్ట్‌మెంట్లకు సమానంగా పంచాల్సి ఉందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల అవసరాలు, ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్ నిధులను ఖర్చు చేయాలని ఆదేశించారు. డిపార్‌మెం ట్ ఖర్చులను కూడా రేషనలైజేషన్ చేసుకుని ప్రయారిటీల అధారంగా ముందుకు వెళ్లాలని సూచించారు. రెవెన్యూ తీసుకువచ్చే శాఖలపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. 

సమీక్షా సమావేశంలో మంత్రులు, కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.