16 April, 2026 | 6:08 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

7న క్యాబ్, ఆటోలు బంద్

04-02-2026 01:43 AM
  1. ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్‌కు యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాల పిలుపు
  2. స్తంభించనున్న ఓలా, ఉబర్, రాపిడో, పోర్టర్ సేవలు 
  3. వైట్ ప్లేట్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 
  4. మద్దతు ప్రకటించిన తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్, ఇతర సంఘాలు 

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఓలా, ఉబర్, రాపిడో, పోర్టర్ తదితర సంస్థల తీరుకు నిరసనగా డ్రైవర్లు సమ్మె సైరన్ మోగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, అగ్రిగేటర్ సంస్థ ల దోపిడీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7న దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ నిర్వహి స్తున్నట్లు యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో ఆ రోజు న క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.

మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు  నోటిఫికేషన్ అమల్లోకి వచ్చినా, కంపెనీలు వాటి ని తుంగలో తొక్కుతున్నాయని కార్మిక సం ఘాలు మండిపడుతు న్నాయి. ఇష్టారాజ్యంగా చార్జీలను నిర్ణయిస్తూ, డ్రైవర్ల పొట్టకొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రయాణికుల నుంచి సర్ చార్జీల పేరుతో భారీగా వసూలు చేస్తున్న సంస్థ లు.. డ్రైవర్లకు మాత్రం నామమాత్రపు ఆదాయాన్ని ఇస్తూ, కమిషన్ల పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపించారు.

పెరిగిన ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చు లు, ఇన్సూరెన్స్ భారం డ్రైవర్ల మీదే పడుతుండటంతో తాము తీవ్ర అప్పుల్లో కూరుకుపో తున్నామ ని వాపోతున్నారు. ఈ సమ్మె ద్వా రా ప్రభుత్వాల ముందు ప్రధానంగా రెండు డిమాం డ్లను ఉంచుతున్నా రు.. ఆటోలు, క్యాబ్స్, బైక్ టాక్సీలకు సంబంధించి కనీస ప్రాథమిక చార్జీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తక్షణమే నోటిఫై చేయాలి. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు గుర్తింపు పొందిన డ్రైవర్ యూనియ న్లతో చర్చలు జరపాలి.

కమర్షియల్ సేవల కోసం ప్రైవేట్ వైట్ ప్లేట్, నాన్-కమర్షియల్ వాహనాలను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించాలి. లేదా ప్రస్తుత చట్టాల ప్రకారం వాటిని కమర్షియల్ కేటగిరీలోకి మార్చాలి. యాప్ ఆధారిత రవా ణా రంగంలో న్యాయమైన, చట్టబద్ధమైన నియంత్రణ కోసం ప్రభుత్వాలు తక్షణమే చర్చలు ప్రారంభించాలని యూనియన్లు డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో లక్షలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించాయి.

ఈ ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్‌కు తెలంగాణ గిగ్ , ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాఉద్దీన్, బీఆర్టీయూ అధ్యక్షుడు అత్తినమొని నాగేష్ కుమార్, వెంకటేశం, అబ్దుల్ రావూఫ్, అలీ బాఖ్రీ, సతీష్ కుమా, ఆర్.కే. రెడ్డి తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.