16 April, 2026 | 7:59 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

గురుకుల విద్యార్థినికి పాము కాటు

04-02-2026 01:45 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థిని వి. అస్మిత మంగళవారం పాము కాటుకు గురైంది. దండంపై దుస్తులు తీస్తున్న క్రమంలో ఆమె చేతిపై పాము కాటు వేయడంతో వెంటనే కేకలు వేయగా అప్రమత్తమైన సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెను హుటాహుటిన 108 అంబులెన్స్‌లో మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి ప్రాణాపాయం తప్పించారు. హాస్టల్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ సమీపంలో వ్యవసాయ భూములు ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, విద్యార్థినిని కాటు వేసిన పాము విషపూరితమైంది కాదని, దీంతో విద్యార్థినికి ఎలాంటి ప్రాణాపా యం లేదని వైద్యులు నిర్ధారించినట్టు ప్రిన్సిపల్ జయశ్రీ తెలిపారు.