04-02-2026 01:41:07 AM
ఆహ్వానించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి సతీష్ ముదిరాజ్ అధ్వర్యంలో జిల్లాలోని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బీసీ, మైనారిటీ, నాయకులు మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్పి కార్యాలయంలోని పార్టీ అధి నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మన పార్టీ సత్తా ఏందో చూపించాలి అని అన్నారు. కార్యక్రమంలో పానుగంటి కృష్ణ, మహమ్మద్ అహ్మద్, భాషా, మహమ్మద్ భాషా, భాస్కర్, రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
మంచిర్యాలలో బీఫారాలు అందజేత
తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మంచిర్యాల జిల్లాలోని 33వ డివిజన్ అభ్యర్థి సాగర్‌కు మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ సెక్రటరీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజల హక్కుల పరిరక్షణకు, స్థానిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ, దినకర్, శ్రీనివాస్, శివ, దీపక్, సోషల్ మీడియా ఇన్‌చారిర్జ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.