30 March, 2026 | 4:15 AM

యుద్ధాలు నివారించి, ప్రపంచశాంతిని కాపాడాలి..

30-03-2026 02:01 AM

ఏప్రిల్ 4న  శాంతి ర్యాలీని విజయవంతం చేయండి

అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల పిలుపు

మణుగూరు, మార్చి 29 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు మానవాళికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, అమాయక ప్రజలు, చిన్నారులు తీవ్రమైన బాధలను అనుభవిస్తున్నారని , సహనం, పరస్పర గౌరవం, మానవతా విలువలు నేటి సమాజానికి అత్యవసరమని మండల అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల పేర్కొన్నారు. ఆదివారం స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  సరెడ్డి పుల్లారెడ్డి( సిపిఐ) సిపిఎం నాయకులు  నెల్లూరు. నాగేశ్వర రావు, న్యూ డెమోక్రసీ నాయకులు ఏ. చంద్రారెడ్డి, ఎంసిపిఐ నాయకులు మోహన్ రావు, సిపిఐ ఎంఎల్  ప్రజాపందా నేత ఆర్. మధుసూదన్ రెడ్డి, ముస్లిం మిల్లత్ కమిటీ నాయకులు  ఎండి రఫీ మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇర్పా చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ,ఏప్రియల్ 4 న  సాయంత్రం 5 గంటలకు పట్టణంలో యుద్ధ వ్యతిరేక శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నామని, దీని లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

యుద్ధం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతు న్నట్లు తెలిపారు. మన దేశం లో పెట్రోల్, వంటగ్యాస్ కొరతతో పాటు నిత్యవసరాల సమస్యలు,ఇతర దేశాల్లో ఆహారం కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు ప్రపంచం దేశాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయని, వెంటనే యుద్ధాన్ని నిలిపి శాంతిని నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధా కర్, గడ్డం వెంకటేశ్వర్లు, సత్రంపల్లి సాంబ శివరావు, ఐఎఫ్టియు నాయకులు ఎస్ డి. నాజర్ పాషా,రాజేందర్, ఆదిలక్ష్మి, సర్వర్, వెంకట్రావు, బొల్లం రాజు, ప్రణయ్, మంగీలాల్, రామకృష్ణ  పాల్గొన్నారు.