30 March, 2026 | 3:48 AM

జాతీయ లోక్ అదాలత్‌లో 3758 కేసుల పరిష్కారం

30-03-2026 02:03 AM

కరీంనగర్ క్రైం, మార్చి 29 (విజయ క్రాంతి): జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కమిషనరేట్ వ్యాప్తంగా  మొత్తం 3758 కేసులు పరిష్కారమయ్యాయని సిపి గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న చిన్నచిన్న కేసులను పరస్పర అవగాహనతో, చట్టబద్ధంగా పరిష్కరించడం ద్వారా కోర్టులపై భారం తగ్గించడంతో పాటు, ప్రజల సమయం, ఖర్చు కూడా ఆదా అవుతుందని అన్నారు.

ప్రజలు తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందగలరని, భవిష్యత్తులో నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కూడా ప్రజలు చురుకుగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కమీషనరేట్లోని పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, సంబంధిత శాఖల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయిలో కేసుల పరిష్కారం సాధ్యమైందని సీపీ పేర్కొన్నారు.