10 June, 2026 | 2:45 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఘనంగా చిన్నారుల ‘గజ్జె పూజ’

30-03-2026 02:00 AM

పాల్గొన్న మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు 

ముకరంపుర, మార్చి 29 (విజయ క్రాంతి): నగరంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం  చిన్నారుల ‘గజ్జె పూజ’ కార్యక్రమం వైభవంగా జరిగింది. 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు ఆధ్వర్యంలో, ప్రముఖ నృత్య కళాకారిణి సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారుల నృత్య ప్రదర్శనలను తిలకించి, అభినందించారు. భారతీయ సంస్కృతిని, కళలను చిన్నతనం నుంచే అభ్యసించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.