16 April, 2026 | 10:06 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అక్రమంగా కెటాయించిన షటర్లను రద్దు చేయాలని ఆందోళన

13-06-2025 06:26 PM

కమిషనర్ శ్రీనివాస్ రావు కి వినతి

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ దుకాణాలను అక్రమంగా అనర్హులకు కేటాయించిన అధికారుల చర్యపై ఆందోళన చేశారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం(Bellampalli Municipal Office) ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. అర్హులకు కేటాయించాల్సిన షటర్లను అక్రమంగా అనర్హులైన ఐదుగురికి కేటాయించారని ఆందోళనకారులు ఆరోపించారు. షటర్లను లాటరీ పద్దతి ద్వారా 25 మందికి కెటాయిస్తామన్నారు. కాని కొంత మంది లాలుచి పడి డబ్బులకు అమ్ముడుపోయి లాటరీ తీసే సమయములో అప్పటికప్పుడు కొంతమంది పేర్లు ఉన్న చీటీలను కమీషనర్ కి ఇచ్చి ఆ చిట్టిలో ఉన్న పేర్లనే ప్రకటించారనీ ఆరోపించారు.

ఈ వ్యవహారమంత జిల్లా కలెక్టర్ కలెక్టర్, బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల సమక్షములోనే జరిగినదనీ తెలిపారు. అందరు చూస్తుండగానే నిజమైన లబ్దిదారులకు అన్యాయo చేశారని మండిపడ్డారు. బెల్లంపల్లి కూరగాయల మార్కేట్ నూతన షెటర్లు లాటరీ ద్వార కేటాయింపు విషయంలో లాటరీ తీసే సమయంలో వెనక వైపు నుండి దొంగ చిటీలు కూరగాయల వ్యాపారానికి  సంభంధం లేని వారి పేర్లు డ్రా పద్ధతి ద్వారా అక్రమంగా షాప్స్ కేటాయించినతీరు ,చిటి అందించే సాక్షాలు, ఫోటో, విడియోలు మా దగ్గర నిరూపించడానికి ఉన్నాయనీ తెలిపారు. షటర్ల కేటాయింపు విషయంలో అవకతవకలకు పాలుపడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అక్రమంగా కెటాయించిన వారి పేర్లను తొలగింది నిజమైన లబ్దిదారులకు కెటాయించాలని లేని పక్షoలో అన్యాయం జరిగిన నిజమైన లబ్దిదారులు వ్యాపారస్తులను, ప్రజలను కలపుకొని, బెల్లంపల్లిలో పెద్దఎత్తున ఆందోలన, నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. అక్రమంగా కేటాయించిన 10,19,16,21.87 ఈ నంబర్ల గల షటర్ల ను అర్హులైన వ్యాపారస్తులకు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో  బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎండి అఫ్జల్, ఆనంద్ సుదర్శన్, ఖలీల్ బేగ్, అన్వర్ ఖాన్, శ్రీనివాస్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.