16 April, 2026 | 11:55 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమం

13-06-2025 06:32 PM

చదువుతో జ్ఞానం పెరుగుతుంది 

మండల ప్రత్యేకాధికారి జ్యోతి

కామారెడ్డి,(విజయక్రాంతి): వయసుతో సంబంధం లేకుండా చదువును నేర్చుకోవడం ద్వారా జ్ఞానం పెరుగుతుందని మండల ప్రత్యేకాధికారి జ్యోతి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా వయోజన విద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... చదవడం రాయడం రాని 15 సంవత్సరాలు దాటిన వయోజనులకు చదవడం రాయడం నేర్పాలని అన్నారు . గ్రామంలో 15 సంవత్సరాలు దాటిన నిరక్షరాసులను ఉల్లాస్ యాప్ ముందు నమోదు చేసి పదిమందికి ఒక వాలంటరీ నియమించి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో MPDO ప్రవీణ్ కుమార్, ఏం ఈ ఓ విజయ్ కుమార్, ఏ పి ఏం రాజు, గ్రామ సంఘం అధ్యక్షులు, వయోజనులు, సీ సీ, వి ఓ ఏ లు పాల్గొనడం జరిగినది.