16 April, 2026 | 8:14 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోండి

13-06-2025 06:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పుస్తకాలు డ్రెస్సులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా నైపుణ్యత బోధించే ఉపాధ్యాయులు ఉన్నారని ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని చెప్పిన పాఠ్యాంశాలను చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మ పరీక్షల సహాయ కమిషనర్ మూడోరపు పరమేశ్వర్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు