15 June, 2026 | 7:19 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

ఎన్నికల వ్యయ నియమాలపై అభ్యర్థులకు అవగాహన

05-12-2025 05:53 PM

కల్వకుర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పరిమితులపై శుక్రవారం కల్వకుర్తిలో ఎంపీడీవో వెంకటరాములు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుండి గెలుపొందే వరకు అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ప్రతి వ్యయానికి అనుగుణంగా రసీదులు సేకరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

అభ్యర్థుల వ్యయ పరిమితి వార్డు సభ్యుల అభ్యర్థులు గరిష్టంగా రూ, 30వేలు, సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా రూ, 1.5లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టంచేశారు. ఈ పరిమితిని మించినట్లయితే అనర్హతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, వీడియో సర్వీలెన్స్ టీమ్, మోడల్ కోడ్ ఆఫ్ కన్డక్ట్ టీమ్ లు నిరంతరం పర్యవేక్షణలో ఉంటాయని, అందువల్ల అభ్యర్థులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించి, నిబంధనలకు లోబడేలా వ్యయాలు నిర్వహించాలని ఆదేశించారు.