calender_icon.png 5 December, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాక్సింగ్ క్రీడా జట్ల ఎంపిక

05-12-2025 06:01:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అండర్ 14 బాక్సింగ్ క్రీడా జట్లను ఎంపిక చేశారు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్మల్ నందు నిర్వహించబడినవని జిల్లా విద్యాధికారి శ్రీ దర్శనం భోజన్న తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు నిర్మల్ జిల్లా జట్టుకు ఎంపిక చేయడం జరిగినది. త్వరలో వీరు కొమరం భీం అసిఫాబాద్ జిల్లాలో జరిగే ఉమ్మడి అదిలాబాద్ జట్టు ఎంపిక పోటీలలో పాల్గొంటారని నిర్మల్ జిల్లా ఎస్జీఎఫ్, ఎస్ఈసీ  తెలిపారు. ఈ పోటీలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్.సత్తయ్య, ఎం.సుమలత, చందుల స్వామి బాక్సింగ్ కోచ్, వెంకటరమణ, విజయ్ మొదలైన వారు పాల్గొన్నారు.