calender_icon.png 5 December, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ నియోజకవర్గంలో 77 సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా

05-12-2025 05:50:21 PM

అనుమతి లేకుండా దాన్యం తీసుకొని రాష్ట్రంలోకి రాకండి: కోదాడ డీఎస్పీ హెచ్చరిక

కోదాడ: ఎన్నికల నేపధ్యంలో కోదాడ నియోజకవర్గంలో 120 గ్రామపంచాయతీలను పరిశీలించగా, వీటిలో 77 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి, అదనపు బలగాలను మోహరింపజేసి, నిఘాను పెంచినట్టు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ సబ్‌ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ, అక్రమ రవాణాపై విషయాలు పై జిల్లా ఎస్పీ ఆదేశాల నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుండి అనుమతి లేకుండా ధాన్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఆరు ప్రధాన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఈ చెక్‌పోస్టుల వద్ద 24 గంటలపాటు పోలీస్ సిబ్బంది నిఘా కొనసాగిస్తూ, అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు.అనుమతి లేకుండా లేదా సరైన పత్రాలు లేకుండా రాష్ట్రంలోకి ధాన్యం రవాణా చేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు ఏడు లారీలు, ఒక ట్రాక్టర్‌పై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అనుమతి లేకుండా ధాన్యం రవాణా చేస్తే క్షమించేది లేదని, వెంటనే కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు మరింత బలపడతాయని, అందరూ చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలీసులు పాల్గొన్నారు.