టీఎస్ టెట్‌పై ఇతర రాష్ట్రాల అభ్యర్థుల ఆసక్తి!
రెండు పేపర్లకు కలిపి 6,833 మంది దరఖాస్తులు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): టీఎస్ టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)పై పక్క రాష్ట్రాల అభ్యర్థులు ఆసక్తి కనబరిచారు. మొత్తం 6,833 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్ 3,349, పేపర్ 3,484 మంది ఏపీ, ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ దరఖాస్తు గడువు శనివారంతో ముగియడంతో మొత్తం దరఖాస్తు వివరాలను అధికారులు ఆదివారం వెల్లడించారు. మొత్తం 2,86,386 దరఖాస్తులు రాగా, అందులో పేపర్ 99,958, పేపర్ 1,86,428 దరఖాస్తులొచ్చాయి. పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు 99,974, సోషల్ స్టడీస్‌కు 86,454 దరఖాస్తులు వచ్చాయి.
జిల్లాల వారీగా..
జిల్లాల వారీగా దరఖాస్తు వివరాలను అధికారులు వెల్లడించారు. పేపర్ అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 7,504 దరఖాస్తులు వచ్చాయి. 771 దరఖాస్తులతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చివరి స్థానంలో ఉంది. పేపర్ అండ్ సైన్స్)కు అత్యధికంగా నల్గొండ నుంచి 7,163, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి నుంచి 935 దరఖాస్తులు వచ్చాయి.
పలు భాషల్లో పరీక్ష నిర్వహణ..
ఈసారి టెట్ పరీక్షను పలు భాషల్లో నిర్వహించనున్నారు. ఒకే పేపర్‌లో తెలుగు/ ఇంగ్లీష్, తెలుగు/సంస్కృతం, ఇంగ్లీష్/ఉర్దూ ఇలా రెండు భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్ పండిట్లు రాసే పేపర్ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, సంస్కృతం భాషల్లో జరగనుంది. పేపర్ సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాళీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ భాషల్లో ప్రశ్నపత్రాలు ఉండనున్నాయి. అయితే ఇందులో ఏదోక భాషను మాత్రమే అభ్యర్థులు ఎంచుకోవాలి.






