సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి
భీమిని,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఐకెపి కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ భీమిని మండలం ఐకెపి వివోఏలు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సేర్ఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివో ఏలు మాట్లాడుతూ అర్హులైన వివో ఏ లను గుర్తించి సీసీలుగా పదోన్నతి, ట్యాబ్, నెట్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.
సేర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ కేటాయించాలన్నారు. కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలన్నారు. సాధారణ ఆరోగ్య భీమా రూ.20 లక్షలు కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత తో పాటు జాబ్ చార్ట్, గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఏళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివో ఏలు లక్ష్మీనారాయణ, సూరం.మల్లేష్, అనూష, రజిత, పుష్పలత, సౌజన్య, ధర్మయ్య, ముక్తేశ్వర్, కే.మల్లేష్, వందన, రమ్య తదితరులు పాల్గొన్నారు.






