జర్నలిస్టులకు మీడియా అకాడమీ చైర్మన్ పరామర్శ
22-04-2024 12:30 AM
ఏప్రిల్ 21(విజయక్రాంతి): రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి వెళ్తూ మధ్యప్రదేశ్‌లో ప్రమాదానికి గురైన సీనియర్ జర్న లిస్టులు శ్రీనివాసరావు, గోపీని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆదివారం నాడు పరామర్శించారు. యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.






