calender_icon.png 18 February, 2026 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి బాదం మిల్క్!

18-02-2026 12:00:00 AM

  1. బేగం బజార్‌లో చల్లని పాల ముసుగులో మత్తు దందా
  2. గ్లాసు మత్తు పాలు రూ.150 l హోలీ వేడుకలే ప్రధాన లక్ష్యం?
  3. ఆగ్రా నుంచి గంజాయి చాక్లెట్ల దిగుమతి.. 1,920 ప్యాకెట్లు సీజ్
  4. నిందితుడు యూపీకి చెందిన వికాస్‌శర్మ అరెస్ట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో మత్తు కోరలు కొత్త రూపాల్లో విస్తరిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గంజాయిని సిగరెట్ల రూపంలోనో, పౌడర్ రూపంలోనో చూడగా.. ఇప్పుడు ఏకంగా మనం ఎంతో ఇష్టంగా తాగే బాదం మిల్క్ తండాయిలో గంజాయిని కలిపి విక్రయిస్తున్న షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

పాలు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే తండాయిలో గంజాయి చాక్లెట్లను మిక్స్ చేసి గం జాయి బాదం మిల్క్ పేరుతో అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న ఒక నిందితుడిని ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ర్టం ఆగ్రాకు చెందిన బి వికాస్‌శర్మ అనే వ్యక్తి గత కొంతకాలంగా నగరంలోని చూడి బజార్ నుంచి బేగం బజార్ మధ్యలో తండాయి.. బాదం మిల్క్ విక్రయాలు జరుపుతున్నాడు.

వేడి చేసి చల్లార్చిన చిక్కటి పాలల్లో ఐస్ ముక్కలు, యాలకులు, డ్రై ఫ్రూట్స్ కలిపి సాధారణంగా ఒక గ్లాసు రూ.50కి అమ్ముతుంటాడు. అయితే, అతి తక్కువ సమయంలో లక్షలు గడించాలనే దురాశతో వికాస్ ఒక ప్రమాదకరమైన ఆలోచన చేశా డు.

ప్రత్యేకంగా మత్తు కోరుకునే వారి కోసం గం జాయి బాదం మిల్క్‌ను సిద్ధం చేశాడు. ఆగ్రా నుంచి తెప్పించిన గంజాయి చాక్లెట్లను ఈ పాల లో మిక్స్ చేసి, ఒక్కో గ్లాసును రూ.150కి విక్రయించడం ప్రారంభించాడు. చూడి బజార్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ స్పెషల్ మిల్క్ కోసం మత్తు బాబులు క్యూ కడుతున్నట్లు సమాచారం.

ఇంటిపై మెరుపు దాడి

నిందితుడు వికాస్ శర్మ కదలికలపై పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి నేతత్వంలోని బందం రంగంలోకి దిగింది. ఉప్పుగూడలోని నిందితుడి ఇంటిపై అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ సోదా ల్లో నిందితుడి ఇంట్లో భారీగా దాచి ఉంచిన 1,920 గంజాయి చాక్లెట్లను అధికారులు స్వాధీ నం చేసుకున్నారు.

వీటి బరువు సుమారు 9.60 కేజీలు ఉంటుందని, ఒక్కో చాక్లెట్‌లో దాదాపు 5 గ్రాముల స్వచ్ఛమైన గంజాయి మిశ్రమం ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరిస్తూ.. ఒక్కో గ్లాసు బాదం మిల్క్ తయారీలో ఒక గంజాయి చాక్లెట్‌ను మిక్స్ చేస్తున్నట్లు తెలిపాడు.

హోలీ వేడుకలే ప్రధాన లక్ష్యం

ఈ గంజాయి చాక్లెట్ల వెనుక పెద్ద నెట్‌వర్కే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు వికాస్‌శర్మ ఈ చాక్లెట్లను ఆగ్రా నుంచి హైదరాబాద్‌కు తరలించాడు. ముఖ్యంగా త్వరలో రానున్న హోలీ పండుగను వికాస్ తన వ్యాపారానికి ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు. హోలీ రోజున రంగులతో పాటు మత్తు పానీయాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వేల సంఖ్యలో ‘గంజాయి బాదం మిల్క్’ గ్లాసులను విక్రయించి భారీగా లాభాలు పొందాలని ప్లాన్ చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసు లు, బైక్, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. రోడ్ల పక్కన విక్రయించే పానీయాలు, బా దం మిల్క్ వంటి వాటి పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి సూచించారు.