calender_icon.png 18 February, 2026 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడకేసిన పారిశుద్ధ్యం

18-02-2026 12:00:00 AM

  1. ఎక్కడకక్కడ చెత్త కుప్పలు 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశుధ్యం తీరు 

కొత్త పాలకవర్గం పారిశుద్ధ్య సమస్య పై దృష్టి పెట్టేనా..?

కామారెడ్డి, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారిశుధ్యo పడకేసింది. చెత్త కుప్పలు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయి. కొత్త పాలకవర్గం రావడంతో చెత్తకుప్పలకు మోక్షం లభిస్తుందా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో పాలకవర్గం లేకపోవడంతో అధికార యంత్రాంగం పారిశుద్ధ్య సమస్యపై సక్రమంగా పట్టించుకోకపోవడంతో పలు కాలనీలో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.

వారం రోజులైనా ఒకసారి చెత్త కుప్పలు తొలగించడం లేదని ఆయా కాలనీలా వాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు చెప్పిన తొలగిస్తామని చెప్పడమే తప్ప నిత్యం చెత్త కుప్పలను  తొలగించాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది సరిగా లేక చెత్తకుప్పలు తొలగించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పారిశుద్ధ్య సిబ్బంది పేర్కొంటున్నారు. 

శానిటేషన్ అధికారుల నిర్లక్ష్యం 

ప్రతి వార్డులో చెత్త కుప్పలు తొలగించాల్సిన పారిశుధ్య కార్మికులు నిర్లక్ష్యం చేస్తున్నారు. శానిటేషన్  అధికారులు చెత్తకుప్పలను తొలగించ కార్మికులపై సూపర్వైసింగ్ చేయకపోవడంతో చెత్తకుప్పలు కాలనీలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే దర్శనమిస్తుంది.

కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఉండటం వల్ల కార్మికులు మున్సిపల్ కార్యాలయ లావద్ద పనులు చేయాల్సి ఉండడం వల్ల చెత్త కుప్పలు తొలగించలేదని శానిటేషన్ అధికారి పర్వేజ్ ను విజయక్రాంతి ప్రతినిధి తో తెలిపారు. ఇకనైనా కొత్త పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టడంతో పేరుకుపోతున్నారు పారిశుధ్య సిబ్బందితో తొలగిస్తారని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు.