05-02-2026 12:49:07 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): గత నెల 30 నుంచి గురువారం వరకు (4 వ తేదీ) నిర్వహించిన న్యూ బోయినపల్లి న్యూ సిటీ కాలనిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి 24 వ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. చివరి రోజు మహాపూర్ణహూతి, శతఘటభిషేఖం, చక్రాస్నానం, పుష్ప యా గం రుత్విక్ సన్మానం నిర్వహించారు.ఈ సం దర్భంగా బ్రహ్మోత్సవాలకు, రథయాత్ర కు సహకరించిన సుమంత్ రెడ్డి దంపతులను,
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్,బేగంపేట్ ఏసీపీ పి.గోపాల కృష్ణ మూర్తి, బోయిన్ పల్లి ఇన్స్పెక్టర్ ఎన్. తిరుపతి రాజు, సబ్ ఇన్స్పెక్టర్లు వి.శివ శంకర్, కిరణ్ నందిత,హనుమాన్ టెంపుల్ ఈవో నరేందర్‌లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్ర మంలో ఆలయ ప్రధానర్చకులు తిరుమల పవన్ కుమార్ స్వామి, ఆలయ కమిటీ అధ్యక్షులు అర్.నారాయణ, ఉపాధ్యక్షులు రా మ్మోహన్ రావు,కార్యదర్శి యాదయ్య,ఉప కార్యదర్శి అత్మానంద రెడ్డి, కోశాధికారి లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు మోహన్ రావు, జగన్నాధం,నర్సింహా రావు, సాంబా శివరావు, పెంటా రెడ్డి,ధర్మవీర్ తదితరులు పాల్గొన్నారు.