22 August, 2026 | 8:19 PM

Breaking News

ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   న్యాయ అవగాహనతో హక్కులపై విద్యార్థులకు అవగాహన   •   సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •   ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడికి సన్మానం   •   ఎంపీడీవోకు వార్డు సభ్యుల ఫోరం సన్మానం   •   శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్   •   పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి   •   ప్రమాదకర గుంతను పూడ్చివేయించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎక్స్‌ప్లోరికా   •   ఔదార్యాన్ని చాటిన ఆదివాసీ నాయకుడు పెండకట్ల యాకయ్య   •  

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

15-03-2025 12:00 AM

బాలకృష్ణ ఇంటిముందు ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14(విజయక్రాంతి) : నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు శుక్రవారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45మీదుగా వచ్చిన ఓ కారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లోగల ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు గల ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ కారు ముందుభాగం దెబ్బతిన్నది. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.