మల్లాపూర్ లో ఘోర ప్రమాదం
బైక్ ను ఢీ కొట్టి ఈడ్చికేల్లిన కారు
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం మీద పయనిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకుని వెళ్ళింది దీంతో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడే దుర్మరణం చెందారు. వివరాలకు వెళ్తే మౌలాలికి చెందిన గణేష్ గంగాధర్ కూలి పని చేస్తూ జీవన సాగిస్తుంటారు.
కూలి పని నిమిత్తం మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని కూలి పని చేసుకుని మంగళవారం రాత్రి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద అతివేగంతో దూసుకొచ్చిన టీఎస్ 03ఫ్ జి 10147 ఐ10 కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన గంగాధర్ గణేష్ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు సంఘటన స్థలాల చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగ కారమని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు అక్కడి నుండి పరారయ్యారని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాచార పోలీసులు తెలిపారు.
న్యాయం చేయాలంటూ మృతుని బంధువులు ఆందోళన
అతివేగంతో మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు డ్రైవర్ని అతనితో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం నాచారం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ద్విచక్రవాహాన్ని బలంగా ఢీకొట్టి ఈడ్చి కెళ్ళిన బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు చనిపోయిన కారు డ్రైవర్ అదుపులోకి తీసుకోవాలని మృతుని బంధువులు ఆందోళన వ్యక్తపరిచారు. కూలి పని చేసుకుంటూ తమకు ఇంటి పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తో కుటుంబం రోడ్డుపై పడ్డదని వారు వాపోయారు డ్రైవర్ మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశాడని మృతుడి గణేష్ భార్య విలపించారు.






