29 July, 2026 | 8:51 PM

చిన్నారిని తొక్కించి కారు డ్రైవర్ పరార్

29-05-2024 01:53 AM

నాగర్‌కర్నూల్, మే 28 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కంప్యూటర్ తరగతికి వెళ్లి వస్తున్న ఓ చిన్నారిని ఢీకొట్టిన కారు డ్రైవర్, పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డుకు చెందిన అనన్య(5) కంప్యూటర్ క్లాస్‌కు వెళ్లి తిరిగివస్తుంది. ఈ క్రమంలో హౌసింగ్ బోర్డు సమీపంలో అత్యంత వేగంగా వచ్చి న కారు చిన్నారిని ఢీకొట్టింది. ఆపై ఆపకుండా కారు డ్రైవర్ పరారయ్యాడు. విష యం తెలుసుకున్న కుటుంబీకులు బాధితురాలిని పట్టణంలోని ఓ ప్రయివేటు దవాఖానకు తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అనం తరం కారును పట్టుకొని పోలీసులకు అప్పగించారు.