calender_icon.png 22 February, 2026 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కేర్ కనెక్ట్ హెచ్‌ఆర్ 2026

22-02-2026 01:07:12 AM

ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా కార్యక్రమ నిర్వహణ  

హైదరాబాద్, ఫిబ్రవరి 21(విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ హెచ్‌ఆర్ 2026’ గచ్చిబౌలిలోని హోటల్ లీ మేరీడియన్‌లో శనివా రం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖ సంస్థల హెచ్‌ఆర్ లీడర్స్, సీఏక్స్‌ఓలు, కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల ఆరోగ్యం, ముంద స్తు వైద్య సంరక్షణ, సంస్థల శ్రేయస్సు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్, చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ శలభ్ డాంగ్, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథూర్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ సింగ్, హెడ్ క్రెడిట్ బిజినెస్ సిద్ధార్థ్ దత్త తదితరులతో పాటు, 200కి పైగా హెచ్‌ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి మారుతున్న సవాళ్లపై చర్చించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థలు ఎక్కువ ఉత్పాదకత, స్థిర త్వం, దీర్ఘకాలిక వృద్ధిని సాధించగలవని నిపుణులు పేర్కొన్నారు.ప్రధాన ప్రసంగంలో కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూసంస్థలు అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స చేయడంపై కాకుండా, ముందస్తు ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలన్నారు. క్రమబద్ధమైన హెల్త్ చెక్‌అప్స్, నివారణ చర్యలు, ఉద్యోగుల శ్రేయస్సు కార్యక్రమాలు సంస్థలకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తాయన్నారు.

శలభ్ డాంగ్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆరోగ్య సేవలు అంటే సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెక్‌అప్ మాత్రమే కాదు. ముందస్తు నిర్ధారణ, అత్యవసర సేవలు, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణఅన్ని కలి సిన సమగ్ర విధానం అవసరం. సంస్థల అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య కార్యక్రమాలు రూపొం దించడమే మా లక్ష్యం అని తెలిపారు.డాక్టర్ అమిత్ సింగ్ మాట్లాడుతూ ఉద్యోగుల శ్రేయస్సు మాటల్లో కాకుండా కార్యాచరణలో కనిపించాలి. ఆరోగ్యాన్ని ప్రోత్సహించే కార్యాలయ సంస్కృతి అవసరం అన్నారు. డాక్టర్ నిఖిల్ మాథూర్ ముందస్తు ఆరోగ్య పరీక్షలు, ప్రారంభ దశలో చికిత్స, కార్పొరేట్ వెల్నెస్ కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ ప్యానెల్ చర్చల్లో పరిశ్రమకు చెందిన ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

అందులో అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ (ఐక్రిసాట్) హెచ్‌ఆర్ విభాగాధిపతి దీప్తి రైనా, వయాట్రిస్ (మైలాన్ ల్యాబ్స్) చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ అడబ్లా, అడాప్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రావంతి చెక్రగారి, జెన్జియోన్ ఎస్వీపీ అండ్ గ్లోబల్ హెచ్‌ఆర్ హెడ్ జనని ప్రకాష్, మై హోమ్ గ్రూప్ ఏవీపీహెచ్‌ఆర్ సుదీప్ కుమార్ కె, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీ సీఎస్) హెడ్‌ఉద్యోగుల ఆరోగ్యం అండ్ భద్రత షాలిని రెడ్డి సింగిరెడ్డి, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ కొడిగంటి, గ్లోబల్ డేటా పీఎల్సీ సిహెచ్‌ఆర్‌ఓ ప్రవీణ్ చందా, వికాట్ (భారతి సిమెంట్స్) హెచ్‌ఆర్ హెడ్ మాలిని చటర్జీ, అలాగే సీ-టెల్ ఇన్ఫోసిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్‌హెచ్‌ఆర్ ప్రమోద్ కుమార్ బేబర్తా పాల్గొన్నారు.

ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఆరోగ్యకరమైన కార్యాలయ వాతావరణం నిర్మాణంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ రూపొందించిన సమగ్ర కార్పొరేట్ ఆరోగ్య కార్యక్రమం ‘హెల్త్ గార్డియన్స్’ను ఆవిష్కరించారు. సంస్థల అవసరాలకు అనుగుణంగా నివారణ, నిర్ధారణ, అత్యవసర వైద్య సేవలను అందించడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ‘కేర్ కనెక్ట్ హెచ్‌ఆర్ 2026’ ద్వారా కార్పొరేట్ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని కేర్ హాస్పిటల్స్ ప్రతిజ్ఞ చేసింది.