17 June, 2026 | 11:38 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

టీజీవో వాణిజ్య పన్నుల శాఖ కార్యవర్గం ఎన్నిక

22-02-2026 01:04 AM

అధ్యక్షుడిగా డి.కిషన్ ప్రసాద్, కార్యదర్శిగా ఎన్.శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ అధికారుల వాణిజ్య పన్నుల శాఖ ఫోర మ్ అధ్యక్షుడిగా  డి.కిషన్ ప్రసాద్, కార్యదర్శిగా యన్. శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. శనివారం నాంపల్లిలోని టీజీవో భవన్‌లో తెలంగాణ గజిటెడ్ అధికారుల వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ఫోరమ్ ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఫోరమ్ అసోసియేట్ అధ్యక్షుడిగా యస్. మధుసూధనాచారి, ఉపాధ్యక్షులుగా కేశవులు, ఎస్.వెంకట్ నర్సింహ, వెల్ది ఇందిర, గుంటి భిక్షపతి, కోశాధికారిగా యం. సతీష్, జాయింట్ సెక్రటరీలుగా ఎండీ. మూస, బీ.మోహన్, వి.పద్మావతి, టీ.హరిప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరిగా పి.రమేష్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్‌గా ఎస్. రాకేష్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నికైన కార్యవర్గాన్ని ఉద్దేశించి తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి బీ.శ్యామ్ మాట్లాడుతూ ఎన్నికైన నాయకులు చిత్తశుద్ధితో పనిచేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.