15 June, 2026 | 7:55 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

నెలలు నిండని శిశువులకు రక్షణ

18-02-2026 01:35 AM
  1. తల్లి గర్భంలో సమస్యల గుర్తింపుతో ప్రాణ రక్షణ
  2. హైటెక్‌సిటీ మెడికవర్ వైద్యుల వెల్లడి

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాం తి): 23 వారాల్లో జన్మించిన శిశువులను కూడా కాపాడే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని హైటెక్‌సిటీ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ పిల్లల వైద్య నిపుణులు నియోనాటలిస్టు డాక్టర్ రవీందర్‌రెడ్డి, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మధుమోహన్, గైనకాలజిస్టు డాక్టర్ భార్గవి వెల్లడించారు. మం గళవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో హై రిస్క్ గర్భధారణల్లో నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు ఆధునికి పరికరాలతో చేపడుతున్న నియోనాటల్ చికిత్స విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్బంగా వైద్యుల మాట్లాడుతూ.. హైరిస్క్ గర్భదారణ తల్లుల్లో  ప్రతి నిమిషం విలువైనదేనని, ‘గోల్డెన్ అవర్’ కీలకమన్నారు. నెలలు నిండకుండా జరిగే ప్రసవాల సందర్భాల్లో సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడం తల్లి, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని తెలిపారు. 23 వారాల్లో జన్మించిన  శిశువులకు ఆధునిక శ్వాస సహాయం, ఇన్ఫెక్షన్ నియంత్రణ, పోషకాహార నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు.

హైటెక్సిటీ మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక ఎన్‌ఐసీయూ సదుపాయాలు, 24 గంటల నీయోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో మార్కెటింగ్ హెడ్ కోట కర్నాకర్, హెచ్ ఆర్ మేనేజర్ ఈశ్వర్ పాల్గొన్నారు.