1 August, 2026 | 3:30 PM

గంజాయి హాట్ స్పాట్లలో తనిఖీలు

01-08-2026 02:41 PM

పాల్వంచ,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణంలో  ఎస్పీ, బాలయ్య పాల్వంచ సబ్ డివిజనల్ డిఎస్పి సతీష్ , సీఐ  ఆదేశంతో పాల్వంచ పట్టణ పోలీసులు పట్టణంలో పట్టణంలో శనివారం గంజాయి హాట్స్పాట్ ఏరియాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు రెగ్యులర్ గా, అనుమానం ఉన్న ప్రదేశంలో చేపట్టడం జరుగుతుంది. గంజాయి కన్జ్యూమర్ సంబంధించి కేసులు  ఇటీవల పాల్వంచ పట్టణంలో నమోదు కావడం గంజాకేసులు నమోదు కావడం జరిగింది.

ప్రభుత్వం , పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యచరణతో భాగంగా ఇతనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ,  ఎక్కడైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయ వలసిందిగా కొడుతున్నారు. గంజాయి కన్జ్యూమర్స్ను, గంజాయి ట్రాన్స్పోర్ట్  వాళ్ల మీద  కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు .ఈ తనిఖీలలో టౌన్ ఎస్ఐ టీ. నాగరాజు, ఎస్సై జి విజయ, హరిబాబు, హెడ్ కానిస్టేబుల్ రఘురాం రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.