1 August, 2026 | 3:30 PM

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జడ్పిటిసి

01-08-2026 02:51 PM

మంథని,(విజయక్రాంతి): మంథని  మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ కుటుంబ సభ్యులను ముత్తారం మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్ రావు  పరామర్శించారు. ఇటీవల సతీష్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, విషాద ఘటనపై ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా  జగన్ మోహన్ రావు మాట్లాడుతూ సతీష్ కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో అందరూ అండగా నిలవాలని కోరారు.

మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండం వసంత్‌రెడ్డి, కన్నాల మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, కాటారం కో-ప్షన్ సభ్యుడు జావిద్ ఖాన్, మాచిడి రవితేజ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.