2 August, 2026 | 10:52 AM

విద్యార్థులకు పోషకాహారం అందేలా శ్రద్ధ తీసుకోవాలి

02-08-2026 10:00 AM

గిరిజన విద్యాసంస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టి

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్

భూపాలపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులకు పోషకాహారం అందేలా శ్రద్ధ తీసుకోవాలని గిరిజన విద్యాసంస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్ అన్నారు. శనివారం జిల్లాలోని గిరిజన విద్యాసంస్థల పనితీరును జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్  తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోల్లబుద్దారం, మహాముత్తారం ఎస్టీ బాలుర వసతి గృహాలు, అలాగే పెగడపల్లి, ముక్కునూరు ఆశ్రమ పాఠశాలలను సందర్శించారు.

తనిఖీల సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలు, హాస్టల్ నిర్వహణ, తరగతుల బోధన విధానాన్ని సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో ప్రవేశాలను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఫలితాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు  సిబ్బంది పాల్గొన్నారు.