2 August, 2026 | 11:18 AM

మాలలు ఐక్యంగా పోరాడాలి

02-08-2026 10:09 AM

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య

నర్సాపూర్: మాలలకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి సుద్దాల దేవయ్య పిలుపునిచ్చారు. శనివారం నర్సాపూర్‌లోని యాదవ్ ఫంక్షన్ హాల్‌లో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన మాలల నియోజకవర్గ సదస్సులో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు కల్లూరి సంజీవ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా రోస్టర్ పాయింట్ల సవరణతో పాటు మాలల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని దేవయ్య కోరారు. రాష్ట్ర నాయకులు పీ. శంకర్, శకుంతల, తిరుపతయ్య మాలల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఐక్యతతో పాటు విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు.