2 August, 2026 | 11:34 AM

తగ్గుతున్న వరద గోదావరి

02-08-2026 10:16 AM

శనివారం రాత్రి 7 గంటలకు 55 అడుగులకు తగ్గిన గోదావరి 

కొనసాగుతున్న మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులు 

క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేసిన కలెక్టర్ అంకిత్ సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట 

భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమం క్రమంగా తగ్గుతున్నది. శనివారం ఉదయం 11 గంటలకు 56. 10 అడుగులకు చేరుకున్న గోదావరి వరద ఇది మొత్తం నాలుగు గంటల పాటు నిలకడగా ఉండి సాయంత్రం నాలుగు గంటల నుండి కొంచెం కొంచెం తగ్గుతూ ఏడు గంటల వరకు 55 అడుగులకు అనగా 1.10 అడుగులకు తగ్గింది. అయితే భద్రాచలం కు ఎగువన గల ప్రాంతాల్లో ఉన్న వాగులు వంకలు ప్రాజెక్టుల నుండి  నీరు రావడం తగ్గడంతో రేపు ఉదయానికల్లా క్రమం క్రమంగా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

ఇప్పటికే భద్రాచలం నుండి చర్ల తుమ్మగూడెం పర్ణశాల వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై తూరుబాక వద్ద గంగోలు వద్ద చిన్న నల్లబల్లి వద్ద గోదావరి బ్యాక్ వాటర్ ప్రధాన రహదారిని ముంచెచ్చటంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే రవాణా సౌకర్యం శనివారం పూర్తిగా బంద్ అయింది. అంతేకాకుండా భద్రాచలం మీదుగా చతిస్గడ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు సైతం గోదావరి వరద వలన భద్రాచలంలో చిక్కుకుపోయారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు లారీలు ఇతర వాహనాలుh భద్రాచలంలోనే ఆగిపోవడంతో ఆయా రాష్ట్రాల ప్రజలు ఎవరు ఇబ్బందులు గురవుతున్నారు. భద్రాచలం నుండి కూనవరం వెళ్లే రహదారిలో రాయనపేట వద్ద నేషనల్ హైవే ని గోదావరి వరద బ్యాక్ వాటర్ ముంచొచ్చటంతో ఈ పరిస్థితి నెలకొన్నది. 

అంతేకాకుండా భద్రాచలం గోదావరి ఒడ్డున గల స్నాన ఘట్టాలు మొత్తం నీటిలో మునిగిపోయి యాత్రికులు చివరి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కర్రకట్ట స్లూయిస్లు పెద్ది సత్రం ఆదర్శనగర్ కొత్త కాలనీ సుభాష్ నగర్ కాలనీ ప్రాంతాలలో లీక్ అవ్వడంతో పలు కాలనీలలోని ఇళ్లల్లోకి వరద నీటు వచ్చింది. అంతేకాకుండా విస్టా కాంప్లెక్స్ వద్ద గల లూయిస్ వద్దగల మోటార్లు పనిచేయకపోవడంతో విస్టా కాంప్లెక్స్ ఏరియా అన్నదాన సత్రం ప్రాంతాలు నీటమునిగాయి.  అయితే గోదావరి శనివారం సాయంత్రం నుండి శాంతించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.