28 June, 2026 | 4:48 PM

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు

28-06-2026 03:45 PM

దమ్మపేట,(విజయక్రాంతి): భారతదేశ వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో (Pulse Polio) కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. దమ్మపేట పరిధిలోని బంజారా కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంగోతు శ్రీనివాసరావు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పల్స్ పోలియో కార్యక్రమం జూన్ 28, 2026 (ఆదివారం) నుండి జూలై 1, 2026 (బుధవారం) వరకు కొనసాగుతుందని, 0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులందరికీ ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోలియో చుక్కలు మందు వేయించాలని సూచించారు. ఆదివారం పల్స్ పోలియో కేంద్రాలకు రాలేకపోయిన చిన్నారుల కోసం ఆరోగ్య కార్యకర్తలు, ఆశా (ASHA) వర్కర్లు నేరుగా ఇంటింటికీ వచ్చి పోలియో కేంద్రాలకు రాలేకపోయిన చిన్నారుల కోసం ఆరోగ్య కార్యకర్తలు, ఆశా (ASHA) వర్కర్లు నేరుగా ఇంటింటికీ వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ధర్మసోతు పద్మ, ఏఎన్ఎం సరిత, భోగం రమణ తదితరులు పాల్గొన్నారు.