17 April, 2026 | 3:05 PM

హౌజ్ అరెస్ట్ షో నిర్వాహకులపై కేసు

11-05-2025 12:00 AM

నటుడు అజాజ్‌ఖాన్, నిర్మాత రాజ్‌కుమార్ పాండేపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ‘హౌజ్ అరెస్ట్’ వెబ్ షోలో అశ్లీల కాంటెంట్ ప్రసారం చేసిన నేపథ్యంలో వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. అజాజ్‌ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్.. ఉల్లు యాప్‌లో ప్రసారమవుతోంది భజరంగ్ దళ్‌కు చెందిన కార్యకర్త గౌతమ్ రవ్రియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

వెబ్ షోలో అశ్లీల భాషలో కాంటెంట్ ఉన్నట్లు గుర్తించారు. మహిళలను కించపరిచే రీతిలో దృశ్యాలున్నట్లు ఫిర్యాదీ పేర్కొన్నారు. ఆ షోకు సంబంధించి అశ్లీల దృశ్యాలను చాలా మంది తమకు షేర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిర్మాత, నటులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ షోను తక్షణమే నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్సీ చిత్రా వాఘా డిమాండ్ చేశారు.