04-05-2025 12:00:00 AM
నాని హీరోగా దర్శకుడు డాక్టర్ శైలేశ్ తెరకెక్కించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలై ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేశ్ విలేకరులతో ఆనందాన్ని పంచుకున్నారు. “నానిని ఎంత వైలెంట్‌గా చూపించాలనేది ‘దసరా’ తర్వా త నిర్ణయించు కున్నది కాదు.
అర్జున్ సర్కార్ ఎలా ఉంటాడో ‘హిట్’ సెకం డ్ పార్ట్ చివర్లో ఒక గ్లింప్స్ చూపిం చా. అప్పుడే ప్రేక్షకులకు ఒక అవగాహన వచ్చింది. -ఈ సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఉంటారని ముందే అనుకున్నాం. అయితే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లేడీస్‌కు ఎక్కువగా నచ్చడం మాకు సర్ర్పైజింగ్‌గా అనిపిస్తోంది. ముఖ్యంగా థియేటర్స్‌కు ఫ్యామిలీస్ వస్తున్నారు. పిల్లల్ని తీసుకురావడం లేదు. అదొక గుడ్ థింగ్. సినిమాలో చూపించిన -డార్క్ వెబ్.. ఇండియాలో ఉన్న అతి పెద్ద సమస్య. అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి.
సైబర్ డిపార్ట్‌మెంట్ దీనిమీద వర్క్ చేస్తోంది. ఈ సినిమా కోసం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు చాలా సహాయం అందించారు. డార్క్ వెబ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. -హిట్ ఫ్రాంచైజీలో కథకు ఏది అవసరమో ఆ ఎలిమెంట్‌ను చేసుకుంటూ వెళ్లడమే నా ఉద్దేశం. హిట్ వన్.. కంప్లీట్‌గా ఇన్వెస్టిగేషన్. ‘హిట్2’ ఒక సైకో కిల్లర్ చుట్టూ నడిచే కథ. ‘హిట్3’ నేషనల్ లెవెల్ క్రైమ్. ‘హిట్4’లో కార్తీ -క్యారెక్టర్ ఏంటనేది నాకు ఐడియా మాత్రమే ఉంది. ఆయనకు క్రికెట్ అంటే ఇష్టం.. బెట్టింగ్స్ వేస్తుంటాడు.
ఆ క్యారెక్టర్ కొంచెం రూటేడ్‌గా, ఫన్‌గా ఉంటుంది. కథలోకి ఒక క్యారెక్టర్ రావడం ఆర్గానిక్‌గా ఉండాలి. ‘హిట్6’ లేదా 7లో హీరోలందర్నీ ఒక ఫ్రేమ్‌లోకి తీసుకురావాలనే ఒక ఇమేజ్ నాకుంది. విశ్వక్‌ను ఇంకా బిగ్గర్ కాన్వాస్‌లో చూపించాలనే ఆలోచనతో ఉన్నా. నేను సిడ్నీలో చదువుకుంటున్నప్పుడు అక్కడి లైబ్రరీలో చాలా పుస్తకాలుండేవి. ఖాళీ సమయంలో క్రైమ్ పుస్తకాల్ని చాలా చదివా. ఆ నాలెడ్జ్ ఇప్పుడు నా సినిమాల్లో ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ డీటెయిల్‌గా ఉండటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నా.
ఈ మూడు నాలుగు నెలలు సిడ్నీలో కూర్చుని ఒక రొమాంటిక్ కామెడీ రాసుకోవాలనుంది. అలా నాలో ఉన్న కామెడీని బయటికి తీసుకు రావాలనుంది. అది ఎంతవరకు కుదురుతుందో చూడాలి. -వెంకటేశ్‌తో మరో సినిమా చేసి ఆయనకు ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే కోరిక ఉంది. ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేశ్ నాతో ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడేవారు. మా అబ్బాయి అంటే వెంకటేశ్‌కు చాలా ఇష్టం. మా అబ్బాయి వీడియోలు, ఫోటోలు వెంకటేశ్‌కు సెండ్ చేస్తుంటాను. ఆయన కూడా రిప్లు ఇస్తుంటారు. మా మధ్య సినిమాకు మించిన బాండింగ్ ఏర్పడింది.