04-05-2025 12:00:00 AM
మల్లేశం, 8పీఎం మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆయన ‘23’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సినిమా రూపొం దించారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు.
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. మే 16న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తుండగా, సన్నీ కూరపాటి సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ ఆలయం ఎడిటర్‌గా, లక్ష్మణ్ ఏలే ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.