27 July, 2026 | 7:53 PM

Breaking News

తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •  

బాల్య వివాహం కలకలం.. మైనర్ అమ్మాయిని వివాహం కానిస్టేబుల్

20-05-2026 11:58 AM

సూర్యాపేట: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై హుజూర్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన నాయని అనిల్ కుమార్ అనే వ్యక్తి యాదగిరి గుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. బాల్య వివాహాలు చేసుకోవడం నేరమని తెలిసినప్పటికి ఓ కానిస్టేబుల్ బాల్యవివాహం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఏసీడీఎస్ అధికారులు కానిస్టేబుల్ అనిల్ పై హుజూర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనిల్ పై బాల్య వివాహాలు నిరోధక చట్టంతో పాటుగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.